
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తమ వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేస్తున్నాని మల్యాల గోవర్ధన్ తెలిపారు.ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) లో ప్రస్తుతం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కొనసాగుతున్నానని, గత దశాబ్దంనర కాలంగా పార్టీ విస్తరణకు నిర్మాణానికి నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరిగిందని, నాయకత్వంలో ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని, అంతేకాకుండా కార్మిక ఉద్యమంలో స్థానిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది, మైనార్టీ సబ్ ప్లాన్ రిజర్వేషన్ కోసం మైనారిటీలను కదిలించి ఐక్య ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నా యొక్క వ్యక్తిగత కారణాల రీత్యానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తానని తెలియజేస్తున్నాను.