ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ-వీణవంక

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎల్బాక గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం ఎల్బాకకు చెందిన కోట శ్రీనివాసరెడ్డి గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ బావి వద్ద మోటార్ పైపు పై కూర్చోగా అది జారీ బావిలో పడ్డాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వీణవంక, మానకొండూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకి తీశారు కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్
గ్రామంలోని యువకుడు శ్రీనివాస్ రెడ్డి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాదం గురించి తెలుసుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.