నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన అటికం అశోక్ తన భార్యతో కలిసి ఉదయం హాలియాకు బైకు పై వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా అనుముల మండలం ఈశ్వర నగర్ సమీపంలో రాగానే ఎదురుగ వస్తున్న డిసిఎం ఢీ కొట్టింది ఈ ఘటనలో అటికం అశోక్ కు తలకు బలమైన గాయాలు కావడం తో ఒక్కడికక్కడే మృతి చెందారు. బైకు పై ఉన్న అతని భార్యకు తీవ్ర గాయాలాయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.