మా నాన్నను ఎమ్మెల్యే కొట్టించాడు.. అతను ఓడిపోవాలి అంటూ

 – జయవీర్ కు ప్రచారం కోసం 5వేలు ఇచ్చిన చిన్నారి
నవతెలంగాణ -పెద్దవూర: ఎవరైనా పార్టీ మీద అభిష్టం ఉంటే వారు ప్రచార ఖర్చులకు చేతనయినంత ఆర్థిక సహాయం చేస్తారు. కొందరు అభిమానులు, మరికొందరు భోజనం పెట్టి కొంత అభిమానం చాటుతారు. కొందరు అవతల పార్టీ మీద కోపం తో ఏమీ ఆశించకుండా జోరుగా ప్రచారం చేస్తారు. ఇలా చేశే వారంతా ఓటర్లు, పెద్దవాళ్ళు చేస్తుంటారు కానీ 10 ఏళ్ల ఓ చిన్నారి. గురువారం రామన్నగూడెం తండాకు కాంగ్రెస్ ప్రచారం కొరకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ దగ్గరికి వెళ్లి ఎంఎల్ఏ భగత్ మానాన్నను కొట్టించాడని, అతను ఎన్నికలో ఓడిపోవాలని తాను దాచుకున్న పాకెట్ మని 5000 రూపాయలు ఇవ్వబోయింది. ఎలాగైనా మీరే గెలవాలి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ సంఘటన రామన్న గూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన తన్నీరు జ్ఞానప్రసన్న నాగార్జున సాగర్ లో ఐపిఎస్ స్కూల్ ల్లో 4వతరగతి చదువుతుంది. ఆ పాప తండ్రిపేరు తన్నీరు సతీష్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అప్పటినుండి కేసీఆర్ మీద అభిమానం తో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఉద్యమాలు చేస్తూ పార్టీ బలోపితానికి కృషి చేశారు. అలాంటి మానాన్నను ఎంఎల్ ఏ నోములభగత్ కొట్టించాడని అతను ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని జయవీర్ విన్నవించింది. చిన్న తనం లోనే మానాన్న ను కొట్టించారని మనోవేదన చెందుతుంది ఆ చిన్నారి.