మాదిగల ఐక్యత కోసం మండల కమిటీ కృషిq

నవతెలంగాణ – మాక్లూర్
మాదిగల ఐక్యత కోసం మండల కమిటీ కృషి చేస్తుందని మండల అధ్యక్షులు దర్గాల సాయిలు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో వివిధ కమిటీలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా ఓట్లు ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకొని, అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెడ్డు శేఖర్, మారంపల్లి బాబు, చిరంజీవి, కోశాధికారి పుల్లెంగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.