బుధవారం మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ- రామారెడ్డి
మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమయపాలన పాటించి, సభా నియమాలను పాటిస్తూ, చర్చలో పాల్గొని, మండల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.