పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్

నవతెలంగాణ – మోపాల్
బుధవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్   నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం మరియు అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పరీక్షించడం జరిగింది. అలాగే తానాకుర్డి మరియు మోపాల్ గ్రామంలోని చెట్లు నాటడం జరిగింది. వర్షాకాలం ప్రారంభం అయింది కావున ప్రతి గ్రామపంచాయతీలో హోం షెడ్డు ప్లాంట్స్ మరియు ఇతర ప్లాంటేషన్ చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శులకు సూచనలు ఇవ్వడం జరిగింది. కచ్చితంగా అమ్మ దర్శ పాఠశాలలో నాణ్యత పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది మరియు ఎంపీడీవో లింగం నాయక్, పాల్గొనడం జరిగింది.