పడకల్లో 12 యూనిట్ల గొర్ల పంపిణీ చేసిన మండల పశువైద్యాధికారి శిరీష

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

మండలంలోని పడకల్ గ్రామంలో 12 యూనిట్ల గొర్ల పంపిణీ చేసినట్టు మండల పశువైద్యాధికారి శిరీష శనివారం తెలిపారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వచ్చిన గొర్రెలను 12 మంది గొర్ల పెంపకం దారులకు అందజేసినట్లు మండల పశువైద్యాధికారి శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ గంగారెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గొర్ల పెంపకం దారులు పశు వద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.