– నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : యూఏఈకి చెందిన ప్రముఖ రిటైలర్ లూలూ గ్రూప్ హైదరాబాద్‌లో తన తొలి మాల్‌ను ప్రారంభిస్తోంది. కూకట్‌పల్లిలోని మంజీర మాల్‌ను ఆసంస్థ కొనుగోలు చేసింది. దీన్ని రీబ్రాండింగ్ చేసింది. బుధవారం జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ , లూలూ గ్రూప్ ఎండీ, చైర్మెన్ యూసుఫ్ అలీ ఎంఎ హాజరు కానున్నారు. మంజీరామాల్‌ను రూ.300 కోట్లు పెట్టుబడితో లూలూ మాల్‌గా రీబ్రాండ్ చేస్తోంది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సదుపాయాలతో హైదరాబాద్ వాసులకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవన్ని అందించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మాల్‌లో వరల్డ్ క్లాస్ లూలూ హైపర్ మార్కెట్ ఉంటుంది. 75 లోకల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ల స్టోర్లు ఉంటాయి. అలాగే 5 స్క్రీన్లలో సినిమాలు కూడా ప్రదర్శించనున్నారు. ఈ మాల్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుందని నిర్వాహక వర్గాలు పేర్కొంటున్నాయి.