మంథని అభివృద్ధి చేసింది శ్రీదర్ బాబే

Manthani was developed by Shridar Babe– పుట్ట మదు చేసింది శూన్యం
– కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
నవ తెలంగాణ మల్హర్ రావు.
మంథని నియోజకవర్గంతోపాటు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబేని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు చేసింది శున్యమని,ప్రజా ఆశీర్వాద యాత్రలో మదు మాట్లాడింది అంతా అబద్దని మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసేల్ చైర్మన్ దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు.బుధవారం రాజయ్య అధ్యక్షతన మండల కేంద్రమైన తాడిచెర్లలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు పుట్ట నాలుగేళ్లు ఎమ్మెల్యేగా మండలంలో చేసింది ఏమిలేదని,అభివృద్ధి అంతా తమ నాయకుడు శ్రీధర్ బాబే చేసినట్లుగా చెప్పారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమన్నారు.40 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయలేదనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, భూపంపిణీ,పాఠశాలలు,రోడ్లు తదితర అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. మదు అనుచరులు దళిత బందు,గృహలక్ష్మీ,బిసి బందు ప్రభుత్వ పథకాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మంథని నియోజకవర్గ ప్రజలు మదు మాయమాటలు నమ్మరని,బిఆర్ఎస్ నాయకులు హత్యలు,అత్యాచారాలకు పాల్పడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొండ రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ఉప సర్పంచ్ చెంద్రయ్య, నాయకులు ఐత రాజిరెడ్డి, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్,అశోక్ రావు,బొబ్బిలి రాజు,మల్కాఅడుసుదం రావు,సతీష్,రాగం రమేష్,రాజ సమ్మయ్య, దుర్గ ప్రసాద్,శంకర్ పాల్గొన్నారు.