మెజారిటీ ప్రజలకు మానవ హక్కులను మృగ్యం చేసేది మనుస్మృతి. మానవ హక్కులకోసం జీవితాంతం పోరాడిన బాబాసాహెబ్ తన ఉద్యమ తొలినాళ్లలోనే మనుస్మృతిని బహి రంగంగా తగలపెట్టారు. 1927 డిసెంబర్ 25న, అంటే 96 ఏళ్ల క్రితం మహద్ చెరువు పోరాటం సందర్భంగా దాన్ని దహ నం చేశారు. మహద్ చెరువులోని నీటిపై దళితులకు కూడా హక్కుందని చాటడానికి జరిగిన పోరాటమని మహర్లు, చం బార్లు, మాంగులతో పాటు అంటరానితనానికి వ్యతి రేకంగా కలిసి వచ్చే ఉన్నత కులాల వారినీ సమీక రించారు అంబేద్కర్ మహద్ సభలో మనుస్మృతిని తగలబెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించే బాధ్యతను ఒక బ్రాహ్మణుడికి అప్పగించారాయన. అప్పటికే ఆం గ్లేయుల పాలనలోని బొంబాయి శాసనసభ, ప్రభు త్వ వనరులను, స్థలాలను అంటరాని వారితో సహా అందరూ ఉపయోగించుకోవచ్చన్న తీర్మానాన్ని ఆమోదించింది. అయినా బ్రాహ్మణులు ఇతర ఉన్నత కులాలవారు అడ్డుకొన్నారు.
మనుస్మృతి దహనంతో మొత్తం భారతదేశ దృష్టిని అంబేద్కర్ ఆకర్షించారు. ఆయన ఉద్యమాన్ని, ఆలోచ నలను లెక్కచేయని పత్రికలు దహనం తర్వాత అంబేద్కర్‌పై కాలుదువ్వి కయ్యానికి దిగాయి. తమ సంపాదకీయాల్లో ఎడా పెడా తిట్టేశాయి. ఆ తిట్లు అంటరానితనానికి వ్యతిరేకంగా జరు గుతున్న పోరాటం పాలిట వరాలయ్యాయి. అంబేద్కర్ ఉద్య మం గురించి కొత్తగా చాలా మందికి తెలిసొచ్చింది. ఆ ఉద్య మంపై నిప్పులు చెరిగిన పత్రికలకు అంబేద్కర్ తన ”బహిషృత్ భారత్” పత్రికలో ఘాటైన సమాధానాలు ఇచ్చారు.
వర్ణాశ్రమ ధర్మాన్ని మనుషుల మీద రుద్దడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. ఈ విషయం మనుస్మృతిలోని రెండవ శ్లోకం లోనే దాపరికం లేకుండా చెప్పారు. ”కొందరు మహర్షులు ఒక రోజు మనువు దగ్గరికి వెళ్లి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలు గు వర్ణాల గురించి చెప్పమని అడిగారట. మనువేమో భృగు మహర్షి చెప్తాడని వారిని పంపించారట. సమాజం మనుగడ సాఫీగా సాగడానికి మనుస్మృతి రాశారని ఎవరైనా చెబితే అది పెద్ద మోసం. మెజారిటీ ప్రజలను దోచుకొని మైనారిటీ జనం సుఖభోగాలను అనుభవించడానికే మనుస్మృతి ఉనికిలోకి వ చ్చింది. అలాగే మహిళలను అణచిపెట్టడానికి పనికొచ్చింది. ఆ స్మృతి ఒకరు రాసింది కాదు. తమ సుఖం కోసం బ్రహ్మణులు వందల యేళ్లపాటు తమ ప్రక్షిప్తాలు జోడించారు.
మనుస్మృతిలో దేవుడు బ్రాహ్మణులకు నాలుగు నియమా లను విధించారట. అధ్యయనం (నేర్చుకోవడం) అధ్యాపనం (నేర్పించడం) యజనం(యజ్ఞం చేయడం) యాజనం( యజ్ఞం చేయించడం). క్షత్రియునికేమో ధర్మబద్ధ పాలన, తనవారి సంరక్షణ, వైశ్యులకేమో వస్తుసేకరణ, ధనార్జన ధర్మంగా చెప్పారు. శూద్రుల విధి పై మూడు వర్ణాలకు సేవచేయడమే అని నిర్ధిష్టంగా నిస్సిగ్గుగా చెప్పారు. దానికి కారణం నాల్గవ వర్ణ మైన శూద్రుల్లో పూర్తిగా అజ్ఞానం ఉంటుందని సిద్ధాంతీకరించారు. వారి శారీరక మానసిక స్థితి లోనూ అనేక దోషాలుంటాయని వర్ణం మార్చుకో వడం సాధ్యం కాదనీ చెప్తుంది. మరి పంచములు ఎలా వచ్చారో స్మృతి చెప్పదు. కాని శూద్రుల కంటే పంచములతో ఎంత అన్యాయంగా, అనాగరికంగా వ్యవహరించవచ్చో చెప్తుంది. మనుస్మృతి క్రీస్తు పూర్వం నుండే రాసిందే అయినా ఇప్పటికీ దాని ప్రభావం హిందూ సమాజంపై గాఢంగా ఉంది. నేటికీ అది విధించిన సానుకూలతలు, ప్రతి కూలతలు అమల్లో ఉన్నాయి.
స్త్రీలకు మనుస్మృతి ఆస్తి హక్కునిచ్చిందని, వరకట్నాలు కన్యాశుల్కాన్ని నిషేధించిందని, స్త్రీకి మళ్లీ చేసుకొనే అవకాశం ఉందని సంతానవతి అయిన భార్య బతికుండగా పురుషుడు మరోపెళ్లి చేసుకోవడాన్ని నిషేదించిందని చెప్తారు. ఆ హక్కు లన్నీ ఎక్కడికి పోయాయి? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన నేటి దశలోనూ సంతానం లేకపోవడాని స్త్రీయే కారణం అన్న భావన అత్యధికుల్లో ఇప్పటికీ ఉండటానికి మనుస్మృతే కదా కారణం.
యత్రనార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్ర దేవతా: అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని అర్థం. మనుస్మృతిలో ఈ శ్లోకం ఉన్న మాట నిజం. అదే సమ యంలో స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో, ముసలితనంలో పుత్రుడు లేదా బంధువుల సం రక్షణలో ఉండాలి. స్త్రీ స్వతంత్రంగా ఉండటానికి వీల్లేదన్న (నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి) శ్లోకం కూడా మనుస్మృతిలోనే ఉంది కదా? స్త్రీ మాత్రమే కామపీడితురాలు అయినట్లు చెప్పే శ్లోకాలు కూడా మనుస్మృతిలో ఉన్నాయి. అనేక చోట్ల స్త్రీలపై ఆంక్షలు విధించి, ఈ ఒక్క శ్లోకంతో పాప పరిహారం పొందాలంటే ఎలా చెల్లుతుంది?
తండ్రి, సోదరులు తనను ఎవరికి అప్పగిస్తారో అతనికి జీవి తాంతం స్త్రీ సేవలు చేయాలి. అతను చనిపోతే మళ్లీ పెళ్లి చేసు కోరాదు. భర్తను ఆదరిస్తే అతను పరలోకంలో కూడా స్త్రీకి సుఖా న్నిస్తాడు. దురాచారి, స్త్రీలోలుడు విద్యాది సుగుణాలు లేని భర్త ను కూడా ఆదరించాలి. అంటే ఆ బాపతు పరలోకంలో కూడా వదలడన్న మాట దురాచారి, స్త్రీలోలుడు, విద్యాది సుగుణాలు లేని భర్తను కూడా స్త్రీ దేవుడిలా పూజించాలి. మంత్రాలోచన సమయంలో వికలాంగులను, వృద్ధులను, మ్లేచ్చులను, స్త్రీలను అక్కడి నుండి పంపించాలని మనుస్మృతి చెప్తుంది. అప్పులకు సంబంధించి ఒక స్త్రీ మరోస్త్రీకి సాక్ష్యంగా ఉండవచ్చట. ఇతర విషయాల్లో మంచి బుద్ది గలవారైనప్పుటికీ స్త్రీలు సాక్షానికి పనికి రారట. ఎందుకంటే వారు చపల చిత్తులని మనుస్మృతి చెప్తుంది కాని నిజానికి సంకల్పశుద్ధి స్త్రీల్లోనే ఎక్కువ కన్పిస్తుంది. ముస్లిం ల్లోనూ ఇద్దరు స్రీ సాక్ష్యులు ఒక పురుష సాక్షికి సమానమట. ఎందుకంటే భగవంతుడు స్త్రీకి సగం మొదడు మాత్రమే ఇచ్చారని ముస్లిం బోధకులు చెప్తుంటారు. ఎంత అశాస్త్రీయం?
మనుస్మృతిని భారత రాజ్యాంగంతో పొల్చుతూ అర్థంలేని వాదన కూడా చేస్తారు. రాజ్యాంగానికి సవరణలు చేసినట్లే మ నుస్మృతిలోనూ కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చేసుకో వచ్చంటారు. 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కనుక మనుస్మృతితో పని లేదని మాత్రం చెప్పరు. ఎందుచేత? రాజ్యాంగ సవరణకు నిర్ణీత పద్దతులున్నాయి. ఒక వేదిక ఉంది. పార్లమెంట్‌లో మూడింట రెండువంతు సభ్యుల ఆమోదంతో మాత్రమే రాజ్యాంగ సవరణ చేయవచ్చు. మరి మనుస్మృతిని ఎ క్కడ, ఎవరు, ఏవిధంగా సవరించవచ్చో చెప్పలేరు. భగవంతుడే మనుషులను అసమాన సామర్థ్యంతో నాలుగు వర్ణాలుగా పుట్టిం చారన్న మౌలిక అవగాహనలో మాత్రం ఎలాంటి సవరణ జరగ లేదు. అలాగే శూద్రులు, పంచములపట్ల సామాజిక వివక్ష చూ పాలన్న శ్లోకాల్లో సవరణ జరగలేదు? స్మృతిలో అనేక మూఢ నమ్మకాలూ ఉన్నాయి. వాటికీ జరగలేదు కదా?
యూరపు దేశాలు ఫ్యూడల్ వ్యవస్థనుండి బయట పడి స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పేర ప్రభుత్వాలను ఏర్పరచుకొన్నాయి. ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వాలు ఏ పాటివి? అన్న విషయాన్ని పక్కన పెడదాం. ఆ దశలో భారతదేశంలోకి తమ మార్కెట్లను విస్తరించుకోవడానికి వచ్చిన ఆంగ్లేయ కంపెనీలు మనదేశాన్ని వలసదేశంగా మార్చుకొని పరిపాలన సాగించాయి. తమపాలన కోసం ఒక చట్టం రూపొందించాలని చూస్తున్న దశ లో వారికి మనుస్మృతి తమకు అనుకూల గ్రంధంగా కన్పించిం ది. బ్రిటిష్ పాలకుల ఆదేశం మేరకు కోల్‌కతాలోని జగన్నాథ తర్క పంచానన అనే సంస్కృత పండితుడు మనుస్మృతిపై ఒక గంధ్రం రాశారు. మనుస్మృతితో పీడిత వర్గాలను ఎంత సునా యాసంగా దోచుకోవచ్చో బ్రిటిష్ పాలకులు కూడా గుర్తించారు. ఆ తర్వాత చాలామంది ఆంగ్లేయులు మనుస్మృతి ని ఇంగ్లీషులోకి అనువదించారు. ప్రజలను విడదీసి పాలించడానికి ఒక రెడీమేడ్ సాధనంగా వారికి మనుస్మృతి కన్పించడంలో ఆశ్చర్యం లేదు.
ఏ మతమైనా, తమ మత గ్రంధాలు దేవుడి నుండి నేరుగా వెలువడినవేనని. వాటిని సవరించడానికి ఏ మాత్రం వీల్లేదని చెప్తుంది. కాని మతాచరణలో అనేక మార్పులు జరుగుతుం టాయి. మారనిదల్లా మార్చడానికి అవకాశం లేదన్న అబద్దం మాత్రమే. ఇతర మతాల్లోలాగే వేదాలను కూడా అపౌరుషేయా లని చెప్పారు. అంటే వాటిని పురుషులు(మనుషులు) రాయ లేదని అర్థం. వేదాలు సులభంగా అర్థమయ్యేవి గావని అందు లో పెక్కు శాఖలున్నాయని, వేదాలకు పరిమితి నిర్ణయిం చలేమనీ చెప్పారు. దానివల్ల హిందూ మతంలోకి దేనినయినా సులభంగా కలిపేసుకొని దాని అవశేషంగా మిగల్చే అవకాశం దక్కింది. బౌద్ధాన్ని , జైనాన్ని, సూఫీ బోధనలను, దర్గాలను, క్రైస్తవ బోధనలను ఒకటేమిటి సర్వం స్వీకరించి ”వాతాపి జీర్ణం” అని త్రేన్చవచ్చు.
అలా చూస్తే బీజేపీ ప్రవచించే పరమత ద్వేషం మత పరమైంది కాదు. అది కేవలం రాజకీయపరమరైంది. ముస్లిం లపై, క్రైస్తవులపై అది విద్వేషం నూరిపోస్తుంది. మనుస్మృతి శూద్రులకు భావక్రటనా స్వేచ్ఛను కూడా నిరాకరించింది. పైమూడు వర్ణాల వారిని విమర్శించకుండా వారికి శూద్రులు శిశ్రూష చేయాలని శాసిస్తుంది. కష్టం చేసే వాడికే కదా నిష్ణామ కర్మ సిద్ధాంతం వర్తించేది. మానవుల్లో బ్రాహ్మణులు శ్రేష్టులని చెప్తుంది. భూమి మీద ఉన్న సంపద అంతటికీ బ్రాహ్మణుడే అర్హుడంటుంది. బ్రాహ్మణుడు ఈ పిండి వంటకం బాగుంది అంటే చాలు మరొకటి వేసుకొమ్మని కోరాలి. ఆ వంటకాన్ని దాచుకోరాదంటూ మనుస్మృతి చెప్తుంది. భోజన ప్రియత్వాన్ని నిసిగ్గుగా చెప్పుకొంది. పక్షులతో మొదలుపెట్టి ఖడ్గమృగం వరకు ఏ మాంసంతో శ్రాద్దం పెడితే పితరులు ఎన్ని నెలల పాటు సంతృప్తిగా ఉంటారో మనుస్మృతి చెప్తుంది. పళ్లు, ధాన్యం కంటే బ్రాహ్మణుడికి మాంసంతో పెట్టే భోజనమే ప్రశస్తమనీ చెప్తుంది.
ఎవరిదీ కాని నిధి బ్రాహ్మణుడికి దొరికితే దాన్ని అతను పూర్తిగా తీసుకోవచ్చు. రాజుకు దొరికితే సగం బ్రహ్మణుల కిచ్చి సగం ఖజానాకు తరలించాలి. శూద్రుడు ఆస్తికి హక్కుదారుడు కాదు గనుక ఆ సమస్యేరాదు. బ్రాహ్మణుడిని తిడితే క్షత్రియు నికి నూరు రూకలు, వైశ్యునికి 200రూకలు, శూద్రునికి దెబ్బలు దండనగా విధించాలి. బ్రాహ్మణుడు క్షత్రియుని తిడితే యాభై రూకలు వైశ్యుణ్ణి తిడితే 25రూకలు, శూద్రున్ని తిడితే 12రూకలు దండన విధించాలి. చట్టం ముందు అందరూ సమానమే సూత్రం వర్తించదు. శూద్రుడు ద్విజులను పాపిష్టి వాడా అని తిడితే వాడి నాలుక కోసెయ్యాలి. ఎందుకంటే వాడిది హీనజన్మ అని స్మృతిలోని శ్లోకాలు చెప్తాయి. రాజ్యాంగం దృష్టిలోనేమో పౌరులందరూ సమానమే, మనుధర్మంలో శిక్షలు, దుస్తులు, ఆభరణాలు, ఆచారాలు వర్ణ, కులాలను బట్టి ఉంటాయి. మనం జాగ్రత్తగా చూస్తే పోలీసుల ప్రవర్తనలో ఇప్పటికీ మనుస్మృతి ని అనుసరించే ఉంటుంది. పోలీసులకు శిక్షణ కన్పిస్తుంది. పోలీసులకు రాజ్యాంగం, చట్టంతో పాటు మనుస్మృతి ని కూడా భోదించి, అందులోని చట్ట సహితం కాని పద్దతులను పాటించరాదని నిర్ధిష్టంగా చెప్పాలి.
(డిసెంబర్ 25 మనుస్మృతిని దహనం చేసిన రోజు)
ఎస్. వినయకుమార్ 9989718311