నవతెలంగాణ- ఆర్మూర్: నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ మజీద్, అజీమ్, నబీల్, షహీద్, అధ్యక్షతన జిరాయత్ నగర్ 14వ వార్డు కి చెందిన సోషల్ ఆక్టివిస్ట్ సాజిద్, శమీన్, ముజిద్, నయీం, అబ్బు, సోహైల్, పవన్ 30మంది ఇతర పార్టీ నుండి గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ మెంబర్ కోలా వెంకటేష్,ఉస్మాన్, మెహబూబ్, పాషా, మహమ్మద్ అలీ, వసిం, హలీం లు తదితరులు పాల్గొన్నారు.