
రెంజల్ మండలం తాడు బిలోలి గ్రామపంచాయతీలో సర్పంచ్ వెలుమల సునీత నరసయ్య అధ్యక్షతన గ్రామ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలను పొందుపరచుటకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్ ను కొనుగోలు చేయడం, డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రపరచడం, ఉప సర్పంచ్ వార్డ్ లో కొత్త పైపులైన్ ఏర్పాటు కోసం తీర్మానం చేయడం జరిగింది. గ్రామంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా దోమల మందును పిచికారి చేయడం, వీధి దీపాలను ఏర్పాటు, లీకేజీలను మరమ్మత్తు పరచడం, బోరు మోటార్లను రిపేర్ చేయడం తదితర అంశాలపై పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మస్కూరి లక్ష్మి, వెల్మల నరసయ్య, గుజల నారాయణరెడ్డి, లక్ష్మీ, సునీత, నాగమణి, క్రాంతి కుమార్, శాంత, మమత, ఎంపీటీసీ చింతకుంట లక్ష్మీ లింగారెడ్డి, గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, కారోబార్ అనంతరావు తదితరులు పాల్గొన్నారు..