రైతు సంక్షేమానికి అనేక పథకాలు

– రైతు దినోత్సవ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్,
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు పరచడం ముఖ్యంగా పంట పెట్టుబడి కోసం రైతు బంధు పథకం రైతు మరణిస్తే రైతు బీమా పథకం ఈ రెండు పథకాలు దేశానికి ఆదర్శమని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు భాగంగా శనివారం నాడు మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో మొత్తం వ్యవసాయ 9 క్లాస్టార్లలో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కొడిచెర గ్రామంలో జరిగిన రైతు దినోత్సవం వేడుకల్లో ఇద్దరు చైర్మన్లు మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ ఆ గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంయుక్త గ్రామ కార్యదర్శి గణేష్ రైతు సమన్వయ కన్వీనర్ ఎం పి ఓ వెంకట నరసయ్య క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల వ్యవసాయ రైతులు పాల్గొనగా మిగతా క్లస్టర్లలో పండుగ వాతావరణంగా భాజా భజంత్రీలతో ర్యాలీలు నిర్వహించి రైతు దినోత్సవం పండుగలు రైతు వేదికల్లో ఘనంగా నిర్వహించారు. మేనూర్ లో జరిగిన ఉత్సవాల్లో మండల తాసిల్దార్ అనిల్ కుమార్ పెద్ద ఎక్లారా లో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో పెద్ద షక్కరుగాలో జరిగిన కార్యక్రమంలో పశు వైద్య డాక్టర్ విజయ్ డోంగ్లి కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్ మద్నూర్ రైతు వేదికలు జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ ఏఈఓ ప్రియాంక రైతు కన్వీనర్లు సురేష్ హనుమాన్లు వివిధ శాఖల అధికారులు క్లాస్టర్ పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో నిర్వహించిన రైతు దినోత్సవం అంగారంగ వైభోగంగా భాజా భజంత్రీల ద్వారా పండుగ వాతావరణం లో రైతులు ఘనంగా జరుపుకుంటూ రకరకాల వంటలతో భోజనాలు చేశారు రైతు దినోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ విండో కార్యదర్శి బాబురావు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు