మార్కెట్లకు మూడో రోజూ లాభాలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడు సెషన్లలో లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీల్లో కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీలు రాణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 21,441కు చేరింది.