తిమ్మాజిపేట: బీఆర్‌ఎస్ పథకాలు దేశానికి ఆదర్శం అని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తోనే అభివద్ధి సాధ్యం అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు బుధవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, తాగునీరు, సాగునీరు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్, విద్యుత్తు లాంటి కార్యక్ర మాలను ప్రతి ఇంటి ఇంటికీ తిరుగుతూ వివరించి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పై ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉం దని, మేము స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి వారితో కలిసి మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ఏదో ఒక పథకంలో లబ్ధి పొంది ఉన్నా మని వారి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ చాలా సానుకూలంగా స్పందిస్తు న్నారని అన్నారు. దానం చిన్న చెన్నయ్య గహంలో జన్మదిన కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ ,ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, రైతుబంధు అధ్యక్షులు వెంకటస్వామి ,ఎంపీటీసీ లీలావతి ,జిల్లా మార్కెట్ డైరెక్టర్లు హుసేని ,కొత్త వెంకటేష్, కవిత , నర్సిరెడ్డి , వెంకట్ రెడ్డి , బాలస్వామి , జైపాల్ రెడ్డి, స్వామి, ప్రశాంత్ ,రాజు ,జగన్ ,రమాకాంత్ పాల్గొన్నారు.