నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తా యని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం, అనాజ్ పూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆది వా రం మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, తన ప్రతిభను వెలికి తీసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. క్రీడలు మానసిక , శారీరక ఉల్లాసం అందించడమే కాకుండా మంచి గుర్తింపు తీసుకువస్తాయన్నారు. టోర్నమెంట్ లో గెలుపొందిన జ ట్టుకు ద్వితీయ బహుమతిగా 25 వేల నగదును అందజే యనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవికాలం దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్రీడాకారులు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు జంగారెడ్డి , రాంరెడ్డి ,తిరుమలరెడ్డి, ప్రదీప్ రెడ్డి, రాజు, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఆర్ వంశీ, వినోద్,వై. వంశీ, శ్రీ కాంత్, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.