గుజరాత్‌లో 157

పాఠశాలలలో ‘జీరో’ ఫలితాలు
అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. రాష్ట్రంలో జరిగిన పదో తరగతి పరీక్షలలో 64.62 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే 157 పాఠశాలలలో ఒక్క విద్యార్థీ పాస్‌ కాలేదు. 1084 పాఠశాలలలో 30 శాతం కంటే తక్కువగానే విద్యార్థులు గట్టెక్కారు. 1,65,690 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా వారిలో కేవలం 27,446 మంది మాత్రమే పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతంలో సూరత్‌ ప్రథమ స్థానంలో నిలవగా దాహోద్‌ చివరి స్థానంలో నిలిచింది.

Spread the love