కాంగ్రెస్ లో భారీగా చేరికలు

నవతెలంగాణ-ఆర్మూర్ : నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిఆధ్వర్యంలో  ఆదివారం పివిఆర్ భవన్ లో 20 వ వార్డు కి చెందిన సోను,అమీర్, అరిఫ్ లు 100 మంది వారి అనుచరులతో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వినయ్ కుమార్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అని అన్నారు.అలాగే సోనియాగాంధీ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన 6 పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని అలాగే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తుందన్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద సామాన్య ప్రజలకు 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆర్మూర్ లో గత 10సంవత్సరాలుగా అధికార పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు ఇప్పటివరకు చేయలేదు  ఆర్మూరు లోకల్ క్యాండెట్ ఎమ్మెల్యే కాకపోవడం వల్ల మన సమస్యలు వారికీ ఎం తెలుసు అందుకని ఈసారి లోకల్ క్యాండెట్ గా మి ముందుకు వస్తున్న అని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిసిసి ప్రచార కమిటీ మెంబర్ కొల వెంకటేష్,ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్,సీనియర్ నాయకులు జిమ్మీ రవి,మజీద్,మహమ్మెద్ అలీ,బట్టు శంకర్,అబ్దుల్ ఫాహీమ్,మీసాల రవి,అబ్దుల్ భారీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.