ఇజ్రాయిల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపాలి ఆర్మూర్ లో భారీ ప్రదర్శన

నవతెలంగాణ -ఆర్మూర్: గాజా పై ఇజ్రాయిల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం నుండి ఇజ్రాయిల్ వెంటనే వైదొలగాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు.  పట్టణంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో  గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం  ఇజ్రాయిల్ బాధితులైన పాలస్తీనా ప్రజలకు మద్దతివ్వకుండా, జీవించే హక్కును హరిస్తున్న ఇజ్రాయిల్ కు మద్దతు ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం అండదండలతో, ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ, పాలస్తీనా ప్రజల ప్రాణాలు బలిగొంటున్న ఇజ్రాయిల్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రతిఘటన పోరాటానికి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని ఆయన తెలిపారు. ఆర్‌.ఎస్.ఎస్‌ వాస్తవాలకు భిన్నంగా ఇండియాలో వ్యూహాత్మకంగా వాఖ్యానిస్తోందని, ఫాసిస్ట్ చర్యలను సమర్థిస్తోందని, ఆయన అన్నారు. హమాస్ ను టెర్రరిస్టు సంస్థగా ఇండియన్ కార్పొరేట్ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రతిఘటన మా జన్మ హక్కు అని గత 70 సంవత్సరాల నుండిఉద్యమిస్తున్న పాలస్తీనా  ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని దాసు తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల కోసం, జీవించే హక్కుల కోసం, న్యూ డెమోక్రసీ పోరాడుతుందని దాసు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ  సబ్ డివిజన్ కార్యదర్శి బి సూర్య శివాజీ, డివిజన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, ఎస్ రవి, ప్రిన్స్, వెంకటేష్, సొప్పరి గంగాధర్, చిట్టక్క, బుజ్జి, సాయన్న,  తదితరులు పాల్గొన్నారు.