బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు (

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
 మండలంలోని కోనాపూర్, కమ్మర్ పల్లి గ్రామాల నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన  నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి గంగాధర్, నరసయ్య, భూమన్న, సుంకరి రాజేశ్వర్, శ్రీను కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కోనాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కాలనీ వాసులు రాజు, శేఖర్, రాజేష్, దశరథ్, రమేష్ మరో 50 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ, ముత్యాల సునీల్ కుమార్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి, సింగిరెడ్డి శేఖర్, పాలెపు నరసయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.