కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ దోపిడీ

– ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
– 25 మందితో బీఎస్పీ మూడో జాబితా విడుదల
– 32 మందితో త్వరలో అభ్యర్థుల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగిందనీ, సీఎం కేసీఆర్‌ అన్నీ తానై చీఫ్‌ ఇంజనీర్‌లా ప్రాజెక్టు డిజైన్‌ చేసి, నాసిరకంగా కట్టడం వల్లే మేడి గడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోయాయ ని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు.శనివారం హైదరాబాద్‌ లోని బీఎస్పీ రాష్ట్ర కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 25 మందితో అభ్య ర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. ఇప్పటి వరకు బీఎస్పీ మొత్తం 87 స్థానాలు ప్రకటిం చగా మరో 32 స్థానాలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటి ంచనున్నట్టు తెలిపారు.ఈ సందర్భం గా ఆయన మాట్లా డుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత కంట్రోల్‌, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిం దన్నారు. నాసిరకంగా కాళేశ్వరం ప్రాజె క్టు కట్టి, లక్ష కోట్ల ప్రజాధనాన్ని గంగ పాలు చేశారని ఆరోపించారు.కాంట్రా క్టుల్లో కమిషన్ల కోసం కేసీఆర్‌ కక్కుర్తి పడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌ చేసి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ను ఎడారిగా మార్చారని తెలిపారు. రూ.లక్ష కోట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొ రేషన్‌లో అప్పు తెచ్చి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మార్గ దర్శకాలు పాటించనం దుకే మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిపోయే ప్రమాదం ఉంద ని హెచ్చరించారని గుర్తు చేశారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్లను కూడా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ పరిశీలించాలని కోరారు.