
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో బుధవారం పెండ్యాల కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పెండ్యాల నారాయణరెడ్డి, విజయరెడ్డి, కిషోర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ గణిత ప్రజ్ఞ పోటీలను పోటీలను నిర్వహించి, ప్రతి తరగతిలో గెలుపొందిన మొదటి విజేతకు₹500, ద్వితీయ విజేతకు ₹300, తృతీయ విజేతకు₹200 లతో పాటుగా,పాఠశాల విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్, ఒక్కో నోటుబుక్కు,2 పెన్సిల్స్ అందించారు. ట్రస్టు నిర్వాహకులు విజయ రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు బ్రతికున్నప్పుడు ఉన్నత చదువులు చదివి దేశ సేవ చేస్తానని చెప్పేవాడని, కానీ తన అకాల మరణం తీవ్ర మనోవేదనను మిగిల్చిందని, తన కుమారునీపై ఉన్న మమకారాన్ని గుర్తుచేసుకుంటూ మనోవేదనను అధిగమించేందుకై, తన కుమారుడు కలలుగన్న ఆశయాన్ని నిజం చేసేందుకై ప్రతి విద్యార్థిలో తన కుమారున్ని చూసుకుంటూ, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, వివిధ పాఠశాలల్లో ప్రజ్ఞా పోటీలను నిర్వహిస్తూ విజేతులకు బహుమతులను అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పులి అశోక రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.