ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వైద్య, దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని కోరారు. జులై 7 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 14వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ షషష.సఅతీబష్ట్రర.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅలో సందర్శించొచ్చు.