నవతెలంగాణ-హన్మకొండ
ఎన్ని నిర్బంధాలు చేసినా,అక్రమంగా కేసులు పెట్టినా భూపోరాటాన్ని ఆపలేరని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం న్యూ శాయంపేట ఏరియాలో భూపోరాట కన్వీనర్ చందా యాకమ్మ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ ఎంసీపీఐ(యు) హనుమకొండ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో న్యూ శాంపేట్ శివారు ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వ భూమి 299 సర్వే నెంబర్‌లో గత నాలుగునెలల క్రితం గుడిసెలు వేసుకోవ డం జరిగిందని గుడిసెలు వేసుకున్నప్పటి నుండి ఈ ప్రాంతంలోని భూకబ్జాదారులైన ఆర్షం అశోక్, బొల్లం విటల్‌తదితరులు నిత్యం బెదిరింపులకు పాల్పడుతూ విద్యుత్, నీళ్లుఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నా రని అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీవాసులతో చేతులు కలిపి ఎంసీపిఐయు మహి ళల కార్యకర్తలపై కర్రలతో దాడి చేసి గుడిసెలను త గులపెట్టారని వెంటనే కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. మా కార్యకర్తలపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఆర్‌ఐతో మాపై కేసులుపెట్టించడం, అధికారులు ఇందిరమ్మ కాలనీ వాసులతో కుమ్మక్కై మాపై కుట్రలుపన్ని కేసులు పెట్టారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భూపో రాటాలు ఆపేదిలేదన్నారు. ఈ సమావేశంలో గాయి రాంమోహన్, సొల్లేటి కళ్యాణి, అలుగునూర్ అశ్విని, సదానందం, ఖాజపాషా, ఓంకార్, రాధిక మణిమాల , సురేందర్, రాణి, కవిత, వైష్ణవి, లావణ్య, కోమల, మహిబుబ్, రమ, కుమార్, సరళ పాల్గొన్నారు.