వాలీబాల్ పోటీలకు ఎండి నోమాన్ ఎంపిక..

నవతెలంగాణ- డిచ్ పల్లి: ఈ నెల 10,11,12 తేదీల్లో సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే అండర్ 19 వాలీబాల్ పోటీలకు డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎం.డి నోమాన్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ చంద్ర విట్టల్ శుక్రవారం తెలిపారు. కళాశాల నుండి విద్యార్థి ఎంపిక కావడంతో అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించి కళాశాల పేరు ప్రఖ్యాతులు గావించే విధంగా పోటీలలో మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు.