ధర్నా చేపట్టిన ఎం.డి.ఎం కార్మికులు…

– సీఐటీయూ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేత…
నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కారానికై నిర్వహిస్తున్న సమ్మె మంగళవారానికి రెండవ రోజుకు చేరుకుంది.తమ సమస్యలు పరిష్కరించాలని ఎం ఈ ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కంప్యూటర్ ఆపరేటర్  మహబూబ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యామిని, నాగ దుర్గ, సీత చిలకమ్మ విజయ కుమారి మురళి నన్ని పద్మ తదితరులు పాల్గొన్నారు.