– జీడబ్ల్యుఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా
నవతెలంగాణ-వరంగల్
తాగునీటి సరఫరాలో సమస్యలను అధిగమించి ప్రతీరోజు నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బల్దియా ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దేశాయి పేట్ ఫిల్టర్‌బెడ్, శివనగర్ వాటర్‌ట్యాంక్‌లను పర్యటించి వరంగల్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన దేశాయిపేట్ ఫిల్టర్‌బెడ్‌లో తాగునీటి సామర్థ్యం, రోజు శుద్ధికరణ జరుగుతున్న నీరు, రోజు నీటి సరఫరా ఎంత జరుగుతోందో, ఎన్ని ఈ ఎల్ ఎస్ ఆర్ ల ద్వారా నీరందించే ప్రాంత్రాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఎల్‌ఎల్‌ఆర్‌లకు నీటిని వదిలే నమోదు రిజిస్టర్‌ను కమిషనర్ పరిశీలించి నిర్ధిష్ట షెడ్యూల్‌ను తూచతప్ప కుండా పాటించాలని ఆదే శించారు. ఈ ఫిల్టర్ బెడ్ల పరిధిలో 33 ఓహెచ్ ఎస్ ఆర్‌లు ఉన్నాయని, అందు లో 25 ఓహెచ్‌ఎస్‌ఆర్ ల కు ఫ్లోమీటర్లు ఉన్నాయని, వెంటనే మిగిలిన వాటికీ ఫ్లో మీటర్లు అమర్చి అన్ని ట్యాంక్‌లకు సమాంతరంగా నీరందేలా అధికారులు లైన్‌మెన్‌లపై నిత్యం పర్యవేక్షించాలన్నారు.
శివనగర్ వాటర్‌ట్యాంక్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ నీటిసరఫరా నమోదు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. పుప్పాలగుట్టలో నిర్మిస్తున్న ఓ హెచ్ ఎస్‌ఆర్‌ను పరిశీలించి నిర్దిష్టగడువులోగా పూర్తి కావా లని అన్నారు. పుప్పాల గుట్ట, మెట్ల బావి, తెలంగాణ కాలనీల్లోని చివరి ఇంటికి నల్లాల ద్వారా అందుతున్న నీటిపై నేరుగా నగర ప్రజలను అడిగి తెలుసుకున్న కమిషనర్ రెండు రోజులకొకసారి నీరు అందుతున్న దని ప్రజలు కమిషనర్ కు తెలుపగా త్వరలో ప్రతి రోజు అందిస్తామన్నారు. బల్దియా కార్యాలయంలో టైల్‌ఎండ్ ప్రజలకు నిరండుతున్నదో తెలుసుకోనుటకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రజలు తెలుపగా కమీషనర్ సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మెట్లబావిను పరిశీలించి దీన్ని సుందరికరించి పర్యాటక కేం ద్రంగా అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. హన్మకొండచౌరస్తా నుండి పద్మాక్షి గుండం మీదుగా హంటర్‌రోడ్ వరకు నిర్మించిన స్మార్ట్‌రోడ్‌ను పరిశీలించి ఇంకను మిగిలిఉన్న ప్యాచ్‌వర్క్‌లను త క్షణమే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు కమిషనర్ పద్మాక్షి దేవాల యం, హంటర్‌రోడ్ నేచర్‌క్యూర్ హాస్పిటల్ ప్రాంతాల్లో టీఎస్ బీపాస్ భవన నిర్మాణానికి మంజురు నిమి త్తం స్థలాలను పరిశీలించారు. టీఎస్ బిపాస్ నిబం ధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఆన్లైన్‌లో మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతి లేకుండా అ నధికారికంగా నిర్మాణాలు చేస్తే కొత్త పురపాలక చ ట్టం ప్రకారంకఠినంగా వ్యవహరిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు కూల్చడంతో పాటు క్రిమినల్ కేసులు న మోదు చేయడం జరుగుతుందన్నారు.
కమిషనర్ వెంట బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చం ద్ర, ప్రత్యేక కన్సల్టెంట్స్ రవి కుమార్, సిపి వెంకన్న, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, స్మార్ట్ సిటీ పిఎంఈ ఆ నంద్ వోలెటి,ఈఈలు రాజయ్య, శ్రీనివాస్, మిషన్ పబ్లి హెల్త్ ఈఈ రాజ్‌కుమార్, డీఈ లు రవికుమార్, నరందర్ తదితరులు ఉన్నారు.