
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. నెక్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముదిగొండ దీక్షకుంట గ్రామాల్లో ఇటీవల పలువురికి డెంగ్యూ వ్యాధి సో కింది ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు పిహెచ్సి ఆధ్వర్యంలో రెండు గ్రామాల్లో శుక్రవారం దోమల మందు పిచికారి చేశారు. ఈ కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు ప్రోగ్రాం అధికారి గ్రామాలను సందర్శించారు వ్యాధుల పరిశుద్ధ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తునందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు రోజువారి జర సర్వే చేపట్టి రోగులను గుర్తించి మందులు పంపించాలన్నారు అలాగే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు కాగా ముందుగా ప్రోగ్రాం అధికారి ప్రాథమిక ఆరోగ్య కేఃద్రాన్ని సందర్శించి రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సబ్ యూనిట్ మలేరియా అధికారి నంద సూపర్వైజర్ యాక స్వామి దీక్షకుంట గ్రామ సర్పంచ్ ఆలకుంట సురేందర్. సిబ్బంది రవి చందర్ రెడ్డి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.