
మండలంలోని బూర్గుల్ లో శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన 110 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివాజీ రావు మాట్లాడుతూ… గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య సేవలు చేసినందుకు, వైద్య బృందానికి గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంపి వైద్యులు ప్రసాద్, గ్రామస్తులు శ్రీరామ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.