రెడ్డి పేట లో వైద్య శిబిరం

Medical camp in Reddy Petaనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేటలో బుధవారం అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మానస ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.