శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
శ్రీ గాయత్రి బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సీఎంఆర్‌ హాస్పిటల్‌ కండ్లకోయ వారి సౌజన్యంతో వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌ యాజమాన్యం సహకారంతో సుభాష్‌నగర్‌లోని వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌ లో ఆదివారం ఉ.9.30 నుండి మధ్యాహ్నం 2: 30 ని. వరకు నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో జనరల్‌ ఫిజీషియన్స్‌ కంటి వైద్యా నిపుణులతో పాటు అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందించారు. సి.ఎం.ఆర్‌ హాస్పిటల్‌ వారి బందం డాక్టర్‌ పవన్‌ జనరల్‌ ఫిజీషియన్‌, డాక్టర్‌ అలేఖ్య డి.జి.ఓ , పి.ఆర్‌.ఓ.దుర్గాప్రసాద్‌ రెడ్డి , మార్కెటింగ్‌ మధు రాజా నారాయణ పాల్గొన్నారు. అధ్యాప కులు, విద్యార్థిని, విద్యార్థులు, ఈ ఉచిత వైద్య సేవలు పొందినట్టు నిర్వాహకులు తెలిపారు. అనంతరం వివేకానంద విద్యా మందిర్‌ హైస్కూల్‌ ప్రధానోపా ధ్యాయులు మండవ శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలోని అన్ని వర్గాల వారికి కార్పొరేట్‌ వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌ కరస్పాండెంట్‌ సునీత , శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు గురజాడ రంగారావు , బుల్లితెర నటుడు ఆదూరి దుర్గ నాగ మోహన్‌ ,కామోల్కర్‌ అనిరుద్‌ శర్మ , సూర్యనారాయణ శర్మ , మారుతి శర్మ , భార్గవ్‌ శర్మ స్కూల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.