త్వరలో మెడికల్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు

– వైద్యసంఘాలతో శనివారం చైర్మెన్‌ సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
త్వరలో మెడికల్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలం గాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ ఎంసీ) చైర్మెన్‌ డాక్టర్‌ వి.రాజలింగం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయా వైద్యసంఘాల అధ్యక్ష, కార్య దర్శులకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మెడికల్‌ కౌన్సిల్‌కు నిర్వహించనున్న తొలి ఎన్నికలివే. ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల ఎన్నికలను పూర్తి చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందు కు అవసరమైన సూచనలు చేయా ల్సిందిగా మెడికల్‌ అసోసియేషన్ల ప్రెసిడెంట్‌, సెక్రెటరీలను కోరారు. ఈ నెల 24న (శనివారం) మధ్యా హ్నం 2 గంటలకు సరోజినీ దేవీ కంటి ఆస్పత్రిలో జరిగే సమావేశా నికి హాజరు కావాల్సిందిగా కోరా రు. ఒకవేళ అధ్యక్ష, కార్యదర్శులు హాజ రు కాకపోతే వారి ప్రతినిధిని పంపిం చాలని సూచించారు.
హెచ్‌ఆర్‌డీఏ పోరాట ఫలితం
టీఎస్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం పట్ల హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ ఆర్‌డీఏ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె.మహేశ్‌ కుమార్‌ ఒక ప్రక టన విడుదల చేశారు. ఎన్నికలను నిర్వహించాలంటూ హెచ్‌ఆర్‌ డీఏ పోరాడిందని గుర్తుచేశారు.
మా కౌన్సిళ్లకు ఎన్నికలెప్పుడు?
టీఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడంతో వైద్యవర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అదే సమ యంలో మెడికల్‌ డాక్టర్ల మాదిరిగానే డెంటల్‌ డాక్టర్లు, నర్సులు తమ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.