పల్లె, బస్తీ దవాఖానాలతో పేదలకు వైద్య సేవలు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పల్లె, బస్తీ దవాఖానాలతో పేదలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. గతంలో పల్లెల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చి న్న జబ్బు, జ్వరం, దగ్గు , జలుబు వచ్చి ప్రయి వేటు ఆస్పత్రుల్లో వేల డబ్బులు ఖర్చుచే యాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జిల్లాలో 81 బస్త్తీి దవాఖానాలు మంజూరు కాగా… ప్రస్తుతం 60 బస్తీ దవాఖానాలు అందుబాటు లోకి వచ్చాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో 158 పల్లె దవాఖానాలు మంజూరు కాగా 82 పల్లె దవాఖానాలు ప్రారంభించుకొని సేవలు అందిస్తున్నాం.