మీషో నూతన బ్రాండ్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : ఈ-కామర్స్‌ వేదిక మీషో నూతన బ్రాండ్‌ను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన నూతన లోగోను ప్రవేశపెట్టింది. దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో లాభాదాయకతపై దృష్టి పెట్టింది. ”పునరుద్ధరించిన నూతన బ్రాండును ఆవిష్కరణతో సంతోషంగా ఉంది. భారత్‌లో ఈ-కామర్స్‌నకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృద్ధి కొనసాగుతుందనే విశ్వాసం ఉంది. ఈ బ్రాండు పునరుద్ధరణ ద్వారా లక్షలాది వినియోగదారులు ఈ-కామర్స్‌ వేదికకు మారటానికి పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం” అని మీషో వ్యవస్థాపకులు, సీఈఓ విదిత్‌ ఆత్రేరు పేర్కొన్నారు.