త్వరలో సీఎంతో క్రైస్తవ నాయకుల సమావేశం

– ఏర్పాట్లపై చర్చించిన బిషప్స్‌, పాస్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్రైస్తవుల సమస్యలు, నామినేటెడ్‌ పదవులు తదితర విషయాలపై చర్చించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ తో సమావేశం కావాలని ఇండిపెండెంట్‌ చర్చెస్‌ బిషప్స్‌, పాస్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ హౌజ్‌లో కార్డినల్‌ ఫూల ఆంథోనిని కలిసి ఏర్పాట్లపై చర్చించారు. కొలంబో ట్రస్ట్‌ వ్యవస్థాపకులు రాజారపు ప్రతాప్‌ ఆధ్వర్యంలో 200 మంది బిషప్‌ లు, దళిత క్రైస్తవ మేధావులు, ప్రొఫెసర్లు తదితరులు సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారిలో బిషప్‌ విల్సన్‌ సింగం, బిషప్‌ భాస్కర్‌ ముల్కల, బిషప్‌ దయానంద్‌ తదితరులున్నారు. ఏప్రిల్‌ 30లోపు సీఎంతో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని ఫూల ఆంథోని సూచించినట్టు అనంతరం నాయకులు తెలిపారు.