నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కొంత మంది విద్యార్థులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో అలాంటి హామీలు ఇస్తామన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. జిల్లాలు, నియోజక వర్గాలలో కూడా అక్కడి ప్రత్యేక అంశాలతో కూడిన స్థానిక మ్యానిఫెస్టోను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.