తాండూరులో మేఘా గ్యాస్‌ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో మేఘా గ్యాస్‌ సేవలు ప్రారంభించినట్టు తెలిపింది. తాండూరు మోమిన్పేట రోడ్‌లోని హది ఫిల్లింగ్‌ స్టేషన్‌లో మేఘా గ్యాస్‌ సీఎన్‌జీ సేవలను అబ్దుల్‌ హది ప్రారంభించారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఈ ఫిల్లింగ్‌ స్టేషన్లో ఇక నుంచి మోటార్‌ వాహనాలకు అవసరమైన మేఘా గ్యాస్‌ను విక్రయిస్తారని ఆ సంస్థ తెలిపింది. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16వది, వికారాబాద్‌ జిల్లాలో రెండోది.
రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘా ఇంటింటికి వంట గ్యాస్‌ను పైప్‌ల ద్వారా సరఫరా చేస్తోంది. జిల్లాలోని 94 ప్రదేశాల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌ సేవలను మేఘా గ్యాస్‌ అందిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో 33 సీఎన్‌జీ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్టు జిల్లా ఇంచార్జి కోరా సాయి తరుణ్‌ చెప్పారు. గ్యాస్‌ వినియోగం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామనీ, అందుకే వాహనదారులు సీఎన్‌జీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.