
రేవల్లి మండలం తలుపునూరు గ్రామంలో శుక్రవారం రోజున గ్రామస్తులు నాగర్ కర్నూల్ జిల్లాలో కలపాలని రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ” మేఘ రెడ్డి ” కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత వెంటనే తలుపునూరు గ్రామాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలో కలుపుతామని, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని, బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని అని ఆయన మాట్లాడారు. తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రతి జిల్లాలో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించడం జరిగింది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తలుపునూరు గ్రామంలో 352 ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించింది, చుట్టుపక్కల గ్రామాలలో మీరు సర్వే చేసి చూడండి, ఇల్లు లేని వారికి ఎంతమందికి ఇల్లు కట్టించిందని ? పేదలకే వదిలేస్తున్నానని ఆయన సూచించారు, ఇది పేదలు గమనించాలి అని! అలాగే రైతులు ప్రభుత్వ భూములను వందల ఎకరాలు పండించుకుంటున్నారంటే కారణం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిజమా, కాదా భూమి దున్నుకొని తింటున్న రైతులను ఎవరి పాలనలో గవర్నమెంట్ భూములు వచ్చినాయని రైతులను అడగండని తెలియజేశారు, కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారిగా పింఛన్ అనే పథకం తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు మీరు తీసుకుంటున్నారంటే ఏ ప్రభుత్వం మీకు స్కీం అందించింది, ఈరోజు మన ఊర్లో ఎంతో మంది స్టూడెంట్స్ చదివి రోడ్లపై తిరుగుతున్నారా లేదా, నిజమా కాదా మీకు తెలియదా, మన ఇంట్లో ఇంటర్, డిగ్రీ, పీజీలు, చేసిన విద్యార్థులు ఇంటికి ఒక్కరైనా కచ్చితంగా ఉంటారు, ఆ విద్యార్థికి జాబులు లేక కూలి పనులు చేయవలసిన పరిస్థితి ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని ఆయన మండిపడ్డారు, ప్రజలు ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పాలన సమయంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఇప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ఆలోచించండి అని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా చదువుకున్న ” కొడుకు & కూతురు ” ఇప్పుడు మన కళ్ళ ముందు జాబు చేయకుండా తిరుగుతుంటే ఆ బాధ ఎలా ఉంటది అనేది మీకు తెలియదా అని ఆయన కుషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ” కరెంటు మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎవరు? మీకు తెలియదా, త్రాగడానికి నీళ్లు, విద్యా, వైద్య, భూములేని పేదలకు ఎన్ని వందల ఎకరాలు కాంగ్రెస్ పాలనలో నిరుపేద రైతులకు ఇచ్చారని అనేది తెలియదా, ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం లో భూమి లేని పేద కుటుంబానికి ఎన్ని వందల ఎకరాలు గ్రామంలో ఏ పేదవాళ్లకు వచ్చాయి, మీ గ్రామంలోనే మీరే తెలుసుకోండని మాట్లాడారు. మా పాలనలో సిలిండర్ ధర ఎంత ఉన్నది, ఇప్పుడున్న ప్రభుత్వంలో సిలిండర్ ధర ఎంత ఉందని ఆలోచించండి, అందుకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే, మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మళ్లీ నిరుపేద కుటుంబాలకు భూములు అందిస్తాం, నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తాం, ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని, ఇప్పుడు ఇస్తున్న ఆసరా పింఛన్ లను పెంచుతామని, వనపర్తి జిల్లా ప్రజల కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని మెగా రెడ్డి భరోసా ఇచ్చారు, ప్రజలే నా కుటుంబం ప్రజలే నా శ్వాస అని ఆయన మాట్లాడారు, ( కెసిఆర్ ) ప్రభుత్వాన్ని ఇప్పటికైనా దోపిడీ ప్రభుత్వం అని తెలుసుకోండి, కెసిఆర్ ప్రభుత్వం పడిపోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యశీల రెడ్డి, జయపాల్ రెడ్డి, ఎక్కే వెంకటేష్, ఎల్కాల వెంకటయ్య, తప్పేట యాదయ్య, కాళ్ళ శేఖర్, రేవల్లి కేశవులు, కురుమూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసింహ, యూత్ అధ్యక్షులు గాజుల రవి, మండల యూత్ అధ్యక్షులు నందు కృష్ణయ్య, రఫీక్, బాలరాజు గ్రామంలోని పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.