మానసిక ఆరోగ్యం మన చేతుల్లోనే

Mental health is in our handsమానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. వీటిని పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల జీవితంలో ఎలాంటి బాధలు వచ్చినా పాజిటీవ్‌గానే ఉంటారని సూచిస్తున్నారు. దాని కోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.. అవే మనల్ని ఎన్నో బాధల నుంచి దూరం చేస్తాయి. అయితే అలాంటి ఎవరో వచ్చి మనకోసం చేయరు. మనకు మనమే వాటిని చేయాలి. ఈ రోజు మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో, మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం…
సాధారణంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఒత్తిడి బారిన పడుతారు. అందులోనూ ఉద్యోగం చేసే వారు సులువుగా ఒత్తిడికి లోన వుతారు. ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించాల్సి రావడమే ఇందుకు కారణం. పిల్లలకు తల్లిగా, సీనియర్‌ సిటిజెన్ల అవసరాలు తీర్చేవారిగా, కుటుంబ పోషకురాలిగా పాత్రలు పోషించాల్సి వస్తోంది. దీనికి తోడు బంధాల్లో ఉండే సమస్యలు, పిల్లలు, ఆఫీసు వ్యవహారాలు.. ఇలా అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ సరిపోవని.. సమాజంలో వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమానత్వం దగ్గరే అసలు సమస్య. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం వంటి వాటిలో సమాన అవకాశాలు చాలా తక్కువ. ఇవన్నీ మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారికి అవకాశమే లేకుండా పోతుంది. దీంతో అనేక మానసిక, శారీరక ఆరోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది.
విభిన్న బాధ్యతల వల్ల… 
మహిళల మానసిక ఆరోగ్య అవసరాలను కుటుంబ సభ్యులు గుర్తించడంలో విఫలమవుతారు. మహిళలు వారి ఆలోచనలకు ఒక క్రమబద్ధమైన రూపం ఇచ్చేందుకు, వారి ఇష్టపడింది చేయడానికి, సంతృప్తిని ఇచ్చే వాటిపై దృష్టి పెట్టేందుకు వారికి సమయమే దొరకదు. ‘దేశంలో మూడింట రెండు వంతుల మంది పెండ్లయిన మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఇక ఆలస్యంగా గర్భధారణ, ప్రసవానంతర సమస్యల్లో ఒత్తిడి సర్వ సాధారణం. కొత్తగా తల్లయిన వారిలో మెజారిటీ (50 నుంచి 80 శాతం) ప్రసవానంతర కష్టాలు ఎదుర్కొంటారు. ఇక వర్కింగ్‌ వుమెన్‌ అయితే సగానికంటే ఎక్కువ మంది వర్క్‌-ఫ్యామిలీ బాలెన్స్‌ సమస్యలు ఎదుర్కొంటారు. 90 శాతం మంది విభిన్న బాధ్యతల కారణంగా ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఇవన్నీ కుటుంబంలో, ఆఫీసులో వ్యక్తుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి. మానసిక రుగ్మతలకు దారి తీస్తాయి. ఇక న్యూక్లి యర్‌ ఫ్యామిలీ (చిన్న కుటుంబాలు)కి ప్రాధాన్యం పెరిగిపోవడంతో అవసరమై నప్పుడు ఆపన్నహస్తం అందించేం దుకు పెద్దవాళ్లు ఎవరూ లేకుండాపో యారు. అందువల్ల మహిళ తన ఆందో ళనలు, కష్టాలను తానే పరిష్కరించు కోవాల్సి వస్తోంది.. అంటున్నారు మానసిక నిపుణులు.
మీ భావాలను రాసుకోండి 
ఒత్తిడిని నుంచి ఎప్పటికప్పుడు బయటపడేందుకు తగిన మార్గాలు వెతకాలి. మంచి మార్గాలతో మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు తమ ఆరోగ్యం బాగుండాలంటే మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. మీ ఆలోచనలను జర్నల్‌ రూపంలో పెట్టడం ఒక థెరపీలా పనిచేస్తుంది. మీ భావోద్వేగాలను స్పష్టమైన రూపంలో వ్యక్తీకరించడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఆశావాద దృక్పథం అలవడుతుంది. ఫలితంగా ఇది వారి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ భావాలను వ్యక్తపరిచేందుకు రాయడం ఇంకొకరితో మాట్లాడడానికి మంచి ప్రత్యామ్నాయం..
సమయం కేటాయింపు..
మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కారణాల్లో ప్రధానమైనది వారు తమ పట్ల తాము కేర్‌ తీసుకోకపోవడం. ఇందుకు కారణం వారికి ఏకాంతంగా ఉండేందుకు తగిన సమయం దొరకకపోవడమే. వారి భావోద్వేగాలను రీసెట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. తమ జీవితానికి ఏది బాగా మేలు చేస్తుంది? ఏదీ పని చేయదు అని తేల్చుకునేందుకు కూడా ఈ సమయాన్ని వారు ఉపయోగించుకోవచ్చు.
అవసరమైతే సాయం… 
మహిళలు తమకు అవసరమని భావించినప్పుడు సహాయం కోరాలి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి అవసరమైతే ప్రొఫెషనల్‌ హెల్ప్‌ తీసుకోండి. కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుంచి అవసరమైన సందర్భాల్లో సాయం పొందడంలో తప్పులేదు. జీవితాన్ని సానుకూలంగా లీడ్‌ చేయాలంటే మీకు మీరు సమయం కేటాయించుకోవాలి. మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆశావాద దృక్పథాన్ని పెంచుకోవాలి.
ఇతరులతో మాట్లాడడం 
ప్రస్తుత కాలంలో ఇతరులతో ఎవరికీ మంచి సంబంధాలు ఉండడం లేదు. ఇది మంచిది కాదు. కచ్చితంగా ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇవి మీ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. మీ అనుభవాలను పంచుకోవడానికి మేలు చేస్తాయి. కాబట్టి భావోద్వేగంగా దగ్గరయ్యేందుకు ట్రై చేయండి. మంచి రిలేషన్‌షిప్‌ బిల్డ్‌ చేసుకోండి. ఇందుకోసం ప్రతి రోజు మీ కుటుంబంతో కలిసి ఉండేందుకు కాస్తా సమయాన్ని వెచ్చించండి. రాత్రి భోజనం కలిసి చేసేలా ప్లాన్‌ చేయండి. మీరు కొన్నిరోజుల పాటు కలవని స్నేహితులను కలిసేందుకు ట్రై చేయండి. మీకు కావాల్సిన వారితో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ట్రై చేయండి. అయితే టచ్‌లో ఉండమన్నాం కదా అని సోషల్‌ మీడియా, ఫోన్స్‌, కాల్స్‌, మెసేజెస్‌ చేయొద్దు. డైరెక్ట్‌గా వెళ్ళి కలిసే ప్రయత్నం చేయండి.
ఫిజికల్‌గా ఫిట్‌గా.. 
చురుగ్గా ఉండడం మీ శారీరక ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి మాత్రమే కాదు, మానసిక శ్రేయస్సుని కూడా మెరుగుపరుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మానసిక స్థితి కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, వర్కౌట్‌, డ్యాన్స్‌, యోగా, వాకింగ్‌ మీకు ఇష్టమైనదాన్ని ఎంచుకుని ఫాలో అవ్వండి. వర్కౌట్‌ చేయమన్నాం కదా అని ఎక్కువ సేపు చేయొద్దు. వాటిని మీ జీవితంలో భాగం చేసుకుంటే చాలు.
బహుమతులు.. 
మీకు ఎవరైనా బహుమతి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్‌ అవుతారో.. అలానే మీరు ఒకరికి గిఫ్ట్‌ ఇచ్చి చూడండి. అంతకు మించిన ఆనందం ఉంటుందని చెబుతున్నాయి పరిశోధనలు. ఇది ఇతర వ్యక్తులతో మిమ్మల్ని కనెక్ట్‌ అయ్యేలా చేస్తుంది. ఎవరైనా మీకోసం ఏదైనా చేస్తే కృతజ్ఞతలు చెప్పండి. హ్యాపీగా ఉండండి.
ప్రజెంట్‌లో ఉండండి.. 
చాలా మంది అయిపోయినదాని గురించి బాధపడడం, భవిష్యత్‌ గురించి బెంగగా ఉండడం చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. అందుకే ప్రస్తుతాన్ని ఎంజారు చేయండి. దీనినే మైండ్‌ ఫుల్‌ నెస్‌ అంటారు. ఇప్పుడున్న దాంతో హ్యాపీగా ఉంటే మీ ఆనందాన్ని ఎవరు దూరం చేయలేరు. మీకు ఇచ్చిన దానినే శ్రద్ధగా ఆహ్వానించి ఆస్వాదిం చండి. అప్పుడే ఎలాంటి బాధ ఉండదు. బాధ లేనప్పుడు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు.
న్యూ స్కిల్స్‌..
కొత్త స్కిల్స్‌ నేర్చుకోండి. దీని వల్ల మీ మాన సిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటి వల్ల మీ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ కూడా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఇతరులతో కనెక్ట్‌ అవుతారు. మీకు టైమ్‌ లేనప్పటికీ ట్రై చేయండి. వంటలు కొత్తవి ట్రై చేయడం, జాబ్‌లో కొత్త బాధ్యతలు తీసు కోవడం, ప్రజెంటేషన్‌ మెరుగు పరుచుకోవడం, ఇంట్లోనే కొత్తగా చిన్నచిన్నవి సృష్టించడం, గార్డె నింగ్‌, కోర్సులు నేర్చుకోవడం, కొత్త భాషలు నేర్చుకోవడం ఇలా ఏదైనా చేయొచ్చు. అయితే నేర్చుకోవడం ముఖ్యమే కానీ ఇష్టం లేనివి ట్రై చేయొద్దు. దీని వల్ల మీకు నేర్చుకోవాలన్న ఇష్టంపోతుంది.