బుద్ధి మాంద్యం అన్నీ ఒకే రకంగా వుండవు. చాలా రకాలున్నాయి. ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరబుల్ పాలసీ, మల్టిపుల్ డిజేబుల్, మాట రాకపోవడం, వినలేకపోవడం. ఇవి రావడానికి 200 కారాణాలు వుంటాయి.
మేనరికం కావచ్చు! సరయిన పోషక పదార్థాలు తల్లి గర్భంలో అందకపోవడం, ఉమ్మనీరు పోయాక కాన్పు, ఫ్రోగెల్ డెలివరీ, కడుపులో వున్నప్పుడు యాక్సిడెంట్స్, గర్భంతో వున్నప్పుడు కిందపడితే కడుపులోని బిడ్డకి దెబ్బ తగిలినా, భార్యాభర్తల మధ్య చాలా గొడవల వల్ల గర్భిణి మానసిక స్థితి దెబ్బతినడం, కృంగిపోవడం, పుట్టాక బిడ్డకి ఫిట్స్ రావడం, ప్రెగెన్సీతో వున్నప్పుడు ఎక్కువ మందులు వాడడం, మాదక ద్రవ్యాల వాడకం, బిడ్డ పసివయసులో ఎక్కువ డోసు వున్న మందులు అధికంగా వాడడం, తరచుగా ఫిట్స్ ఫిట్స్ రావడం, జ్వరంగా వున్నప్పుడు నిద్రలో బ్రెయిన్ డ్యామేజ్ అవడం… ఇలా ఎన్నో రకాల కారణాలున్నాయి బుద్ధిమాంద్యం రావడానికి. రూరల్‌లో పోషకాహార లోపం, ముస్లిం ఫామిలీల్లో దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు చేయడం, పల్లె ప్రాంతాల్లో కాన్పు సమయంలో సరయిన అవగాహన లేక మంత్ర తంత్రాలు, చేతబళ్లు అన్నీ సరైన సమయంలో పిల్లలని వైద్య సలహాలు తీసుకోకపోవడం, అమావాస్య, పున్నమి రోజులో చాలా పిచ్చిగా ప్రవర్తిస్తారు అనడం… ఇవన్నీ అపోహలే!
కడుపుతో వున్న మహిళకి బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో సరయిన అవగాహన వుండాలి. కాలం మారింది. ప్రతి విషయానికి అవగాహన, సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. ప్రతి చిన్న విషయానికి కంగారు పడడం, డాక్టర్ ఇలా చెప్పాడు, అలా అన్నాడు, మా బాబు నడవడంలేదు, బిడ్డ పుట్టగానే ఏడవలేదు…. ప్రాథమిక దశలో ఇవే లక్షణాలు వుంటాయి. వినికిడి చెక్ చేయాలి. ఎలా స్పందిస్తున్నారో గమనించాలి. ఒకవేళ ఆటిజం లక్షణాలు కనిపిస్తే, వారి ఎదుట…. ఎడ్డోడు, బుద్ధిలేనోడు పుట్టాడు అని పదేపదే అనకూడదు. వారిలో బిహేవియర్ సమస్యలు అధికమవుతాయి. ఏ పని మనం చేయొద్దంటామో, అదే పని చేసి చాలా అల్లరి, గోల చేస్తారు. పిచ్చిగా ప్రవర్తిస్తారు. అదే వయసులో ఇద్దరు పిల్లలు ఇంట్లో వుంటే కంపేర్ చేసి వాడు అలా వున్నాడు, నీవు అలా లేవు అని మానసికంగా వారి చుట్టూ వున్నవాళ్లు వేధించకూడదు. కొట్టడం, తిట్టడం చేయకూడదు. ఎక్కువగా మందులు వాడకూడదు. వారికి ప్రేమ, ఆప్యాయత, లాలన చాలా అవసరం. ప్రేమతోనే వారిలో న్యూనతాభావం పోయి, నెమ్మదిగానైనా అందరిలా ఎదిగే అవకాశం వందశాతం వుంటుంది. అవగాహన, అనుభవవముండి, ప్రత్యేక శిక్షణ ఇచ్చే స్కూళ్లు, టీచర్ల ద్వారా వీరికి ఆ వ్యాధి నయం చేయవచ్చు.
బుద్ధిమాంద్యం లక్షణాలుంటే యాక్సిడెంట్‌లో చెయ్యిలేదు, కాలు పోయింది, ఇలాగే వుంటే ఎలా? వున్న ఈ శరీరంతో ఎలా జీవించాలో పిల్లలకి నేర్పించాలి. పెద్దలుగా, తల్లిదండ్రులుగా బాధ్యతతో వారికి ధైర్యం చెప్పాలి.
1. ఆటిజం: కళ్లల్లో కళ్లు పెట్టి చూడరు. ఒకే పనిని పదేపదే చేస్తారు. ఒంటరిగా వుండాలనుకుంటారు. హైపర్ యాక్టివ్‌గా వుంటారు. వారి పని వారు చేసుకోలేరు. ఏ వస్తువుతో ఎక్కువగా ఆడరు (సెల్ఫ్ స్టొమిలేషన్). గుర్తు పట్టరు. మ్యానర్స్ నేర్పించాలి.
2. బుద్ధిమాంద్యం (డౌన్ సిండ్రోమ్) : అందంగా వుంటారు. ఈ వ్యాధి వారు అందరూ ఒకేలా వుంటారు. తమలో తాము మాట్లాడుకుంటారు. బిహేవియర్ ప్రాబ్లమ్ వుంటుంది. స్లోగా వీరికి నేర్పిస్తే వీరిలో వందశాతం మార్పు వస్తుంది. యాంకరింగ్‌కి, యాక్టింగ్‌కి, ఫొటోలకి ఫోజులిచ్చి, ఎడ్వర్‌టైజ్ చెయ్యడానికి ఈవరు చాలా బాగుంటారు. ప్రత్యేక శిక్షణ ద్వారా వీరి ఐ.క్యూ. ని వెలికి తీసి భవిష్యత్ నిర్ణయించాలి.
3. మల్టిపుల్ డిసేబుల్ : ముద్ధిమాంద్యంతో పాటు వినికిడి సమస్యగాని, మాట రాకపోవడం గాని వుంటుంది. శరీరం ఎదగకపోవడం వుంటుంది. బలహీనంగా వుంటారు. తరచూ జలుబు, జ్వరం, ఫిట్స్ వస్తుంటాయి. సరైన వైద్య పరీక్షలు చేసి, ఐ.క్యూ. లెవల్ తెలుసుకుని, సమస్యకు తగ్గట్టు ప్రత్యేక పాఠశాలల్లో శిక్షణ ఇవ్వాలి.
4. సెలబుల్ పాలసీ : కాలికిగానీ చెయ్యికిగానీ పక్షవాతం, శరీరంలో కొంతభాగం… అంటే కింది భాగం కానీ, పై భాగం కానీ, ఓ పక్క పనిచేయకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వీరికి ఫిజియోథెరపీ చేయించి, ఐ.క్యూ లెవల్స్ ని బట్టి ప్రత్యేక విద్యలో శిక్షణ ఇప్పించాలి. మల, మూత్ర విసర్జన క్రియలు క్రమబద్దం చేయాలి. తినడం, తాగడంలో శిక్షణ ఇవ్వాలి.
ఇలా ఎన్నో రకాల బుద్ధిమాంద్యం లక్షణాలున్న పిల్లలు సమాజంలో వున్నారు. వారి ఐ.క్యూ లెవల్స్‌ని చెక్ చేయాలి. నేషనల్ ఇస్టిట్యూషన్ ఆఫ్ మెంటల్లీ హాండికాప్డ్ సంస్థ బోయిన్‌పల్లిలో వుంది. వీరిపై నిరంతరం రీసెర్చ్ జరుగుతుంది. ఐ.క్యూ, జోన్స్ పరీక్షలు చేసి, ట్రైనింగ్ ఇస్తారు. కానీ మన తెలంగాణలో తెలుగు తప్ప ఇతర భాషలు రావు. వెనుకబడిన వారం, ఎన్.ఐ.ఎం.హెచ్. లో హిందీ, ఇంగ్లీషులోనే రీసెర్చ్ జరుగుతుంది. వేల సంఖ్యలో పుస్తకాలు, శిక్షణ కోసం ప్రభుత్వం కోట్ల రూపయాలు ఖర్చు చేస్తుంది. కానీ తెలుగులో రీసెర్చ్ ఇన్‌ఫర్మేషన్ తెలుగులో వుండదు. ఏం జరుగుతుందో తెలుగులోనే తెలుసుకోవాలంటే కష్టం. నార్త్ వాళ్లు వందల సంఖ్యలో శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. పిల్లలకి ఫ్రీ ఐ.క్యూ లెవెల్ టెస్ట్ చేసి మనకి సరైన ఇన్‌ఫర్మేషన్ ఇస్తారు. ప్రత్యేక అవసరాల పిల్లలకి ప్రత్యేక లక్షణాలుంటాయి. సంగీతం, నృత్యం, మ్యూజిక్, పెయింటింగ్… లాచలా విషయాల్లో వీరు ముందంజలో వుంటారు. ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం వుంటే తప్పక విజయం సాధిస్తారు. దేనీకి భయపడాల్సిన అవసరం లేదు.
– డా|| లక్కరాజు నిర్మల