స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మేరా దేశ్ మేరా మట్టి అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 17 గ్రామ పంచాయతీల పరిధిలో మట్టిని సేకరించి అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. అనంతరం అట్టి మట్టిని రాజధానికి తరలించి అట్టి మట్టితో అమరవీరుల పేరుతో మొక్కలు నాటి అమరవీరులకు జోహార్లు అర్పించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుండి సేకరించిన మట్టిని ఒక కుండలో జాగ్రత్తపరిచి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ ఉద్దీన్, డాక్టర్ వినయ్ కుమార్, హెచ్ర్ వో లు శ్రవణ్ కుమార్  కరిపే రవీందర్, సూపర్డెంట్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, 17 గ్రామపంచాయతీలలోని కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశలు, ఉపాధి హామీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.