నాలేశ్వర్ లో మేరా మిట్టి మేర దేశ్..

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో బిజెపి నాయకులు మేర మిట్టి మీరా దేశ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణ నుండి పవిత్రమైన మట్టిని సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో 75 మొక్కలను నాటారు. అనంతరం చేతిలో మట్టిని తీసుకొని పంచప్రాణాల ప్రతిజ్ఞ చేసి ఈ మట్టిని దేశ రాజధాని ఢిల్లీకి పంపడానికి కలశంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, శ్రీధర్, మండల అధ్యక్షులు, సర్పంచ్ సరీన్, గోపి, యోగేష్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.