నీట్‌ విద్యార్థులకు మెరిట్‌ కౌన్సెలింగ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌-2024 కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్న సూపర్‌ 30 బ్యాచ్‌కు ఉచిత మెరిట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్టు మెటామైండ్‌ అకాడమి డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఈనెల 21వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఉపయోగించుకోవాలని సూచించారు. మెటామైండ్‌ నీట్‌ అకాడమి, రామకృష్ణ మఠం పక్కన, దోమల్‌గూడ, హైదరాబాద్‌ కార్యాలయంలో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ, ఇతర వివరాలకు 7032264910, 8522958575 నెంబర్లను సంప్రదించాలని కోరారు.