సీవీ ఆనంద్‌కు అతిఉత్కృష్ట సేవా పతకం

అభినందించిన పీస్‌ కమిటీ సభ్యులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ అనంద్‌కు అతి ఉత్కృష్ట సేవా పతకం లభించింది. విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర హౌం మంత్రిత్వశాఖ ఈ అవార్డును ప్రకటించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌ పీస్‌ కమిటీ సభ్యులు సీవీ అనంద్‌కు అభినందనలు తెలిపారు. పీస్‌ కమిటీ ఈస్ట్‌జోన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎన్‌ శరత్‌శ్యాం ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు చెప్పారు. ఆయనతో పాటు పీస్‌ కమిటీ ఈస్ట్‌జోన్‌ ఉపాధ్యక్షులు డాక్టర్‌ యూసఫ్‌ హమీదీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మజహ్రుద్దీన్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్‌ అధ్యక్షులు మౌజం, సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షులు శశికాంత్‌, సౌత్‌జోన్‌ అధ్యక్షులు ఖాజా అబ్దుల్‌ మొయిజ్‌, వెస్ట్‌జోన్‌ అధ్యక్షురాలు తేజు తదితరులు కమిషనర్‌ సీవీ అనంద్‌కు అభినందనలు తెలిపారు.