ఆహారం కోసం వలసకు వచ్చిన బాతులు..

నవ తెలంగాణ- రెంజల్ :

రెంజల్ మండలంలో వరి కోతలు ప్రారంభం కావడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి బాతుల యజమానులు వాటి ఆహారం కోసం వలస వస్తున్నారు. వరి కోతలు పూర్తి అయిన పంట పొలాలలో కిందపడ్డ ధాన్యం గింజలను బాతులు ఆహారంగా తీసుకుంటున్నాయి. దగ్గరలో ఉన్న నీటి గుంటల వద్ద దప్పిక తీర్చుకొని తిరిగి పంటలు పూర్తయిన పొలాలలోని గింజలను వాటి ఆహారాన్ని తీర్చుకుంటున్నాయి. వందల సంఖ్యలో బాతులు వస్తుండడంతో వారు పంట పొలాలలోనే గుడారాలను వేసుకొని వాటి రక్షణ కోసం జాలీలలో ఉంచుతున్నారు. రెండు మూడు రోజులకు మారు బాతుల గుడ్లను జమ చేసి తిరిగి వాటిని ట్రైన్లో నెల్లూరుకు పంపుతామని వారు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలో ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో వరి పంటలు ఎక్కువగా పండించడం వల్ల వాటి ఆహారాన్ని తీర్చడానికి వారు ప్రతి ఏటా వాటిని ఇక్కడికి తీసుకువస్తూ ఉంటామని వారి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలతో పాటు, బోధన్, ఎడపల్లి, నవీపేట్ మండలాలలో సైతం వారు వలస వచ్చి బాతుల ఆహారాన్ని అందించనున్నట్లు వారు పేర్కొన్నారు.