బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు

– నాగర్‌కర్నూల్‌ నాయకుల చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే నాయకుల వలస కొనసాగుతూనే ఉన్నది. తాజాగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హస్తం గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో వైస్‌ ఎంపీపీ నిర్మల, ఎంపీటీసీలు కృ ష్ణయ్య, శ్రీను, రాజు, మల్లయ్య, మాజీ ఎంపీటీసీలు రమణారావు, శాంతయ్య, సర్పంచ్‌ స్వామి, ఉప సర్పంచ్‌ భగవంత్‌గౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు రామచంద్ర రావు, తిరుపతయ్య, మాజీ సర్పంచులు నర్సింహా, బుచ్చన్న, కుర్మయ్య, కౌన్సిలర్‌ శ్రీనివాసులు తదితరులున్నారు.
త్వరలో వజీర్‌ ప్రకాష్‌ గౌడ్‌ చేరిక
బీఆర్‌ఎస్‌ నేత, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ వజీర్‌ ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. తాజాగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రే, మధుయాష్కీగౌడ్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు.