కోటి మంది చూశారు

ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలుగులో విడుదల చేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాటల రచయిత భీమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ,’తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరిస్తున్నారు’ అని తెలిపారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘నైజాంలో దాదాపు 500 స్క్రీన్స్‌కి పైగా సినిమాను రిలీజ్‌ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. ఇది ఒక స్టార్‌ హీరోకు రికార్డ్‌ స్థాయి కలెక్షన్‌. రెండో రోజు దాదాపు 8 కోట్ల రూపాయలు వచ్చాయి. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల స్పందన బాగుంది. కలెక్షన్స్‌ స్థిరంగా కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. ‘నిన్నటి వరకు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ సభను రామకోటి ఉత్సవంగా పిలవాలని అనుకున్నాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ అనుకున్నది ఏంటంటే..రామనామాన్ని ప్రతి గడపకు చేర్చాలని. ఆ ప్రయత్నంలో మేము సఫలీకతం అయ్యాం. ట్రోల్‌ చేసేవారు కూడా పరోక్షంగా రాముడిని తలుచుకుంటున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లన్నీ సరికొత్త రికార్డులు సష్టించాయి.