అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ-పాలకుర్తి
సీఎం కేసీఆర్‌ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేశానని అభివద్ధిని చూసి ప్రజలు ఆశీ ర్వదించి మరోసారి గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎర్రబెల్లి ఉషాదేవి నామినే షన్‌ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి ని యోజకవర్గం లోని ప్రతి గ్రామంతో పాటు తండాలకు ఆవాస ప్రాంతాలకు బీటి రోడ్లతో పాటు సిసి రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారని తెలిపారు. సింగిల్‌ రోడ్లుగా ఉన్న బీటీ రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చారని తెలిపారు. పాలకుర్తి ప్రాంతాన్ని సుమారు 100 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశా మని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో పాలకుర్తిని రాష్ట్రంలోనే అగ్ర భాగాన నిలిపానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసేందుకు మాయమాటలతో ప్రజల వద్దకు వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో కరోనా సమయంలో ప్రజలను కాపాడి అండగా నిలిచానని తెలిపారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మళ్లీ సీఎం కేసీఆర్‌ అవుతారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రితోపాటు పాలకుర్తిలో 50 పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించానని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మా ణంలో పాలకుర్తి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చి దిద్దామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకా శాలు కల్పించేందుకు ప్రతి గ్రామం నుండి వందమంది యు వకులను ఎంపిక చేసి రాబోవు రోజుల్లో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తానని తెలిపారు. 10న ప్రజల మద్దతుతో నామినేషన్‌ వేస్తానని నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌ రావు సత్యవతి రాథోడ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, కడియం శ్రీహరి లు పాల్గొంటారని, ఈనెల 14న తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరవుతున్నారని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నామినేషన్‌ కార్యక్రమంతో పాటు బహి రంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అంతకు ముందు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, బిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్‌, ఫ్లోర్‌ లీడర్‌ శ్రీనివాసరావు, పాలకుర్తి సర్పంచ్‌ వీరమనేని యాకాంతరావు, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు ఎండి మదార్‌, కొడకండ్ల, పాలకుర్తి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లు ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు, మాచర్ల ఎల్లయ్య, పళ్ళ సుందర్‌ రామిరెడ్డి, ఈదురి ఐలయ్య తోపాటు ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.