నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్దులు విద్యతో పాటు సమాజం., రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు సమాజానికి మూల స్థంబాల్లాంటి వారని తెలిపారు. తెలంగాణ సచివాలయంలో గురువారం తన ఛాంబర్ లో సీఓఇ ( కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ) విద్యార్ధులకు మంత్రి ల్యాప్ ట్యాప్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాయని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చిందనీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకుల విద్యావిధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.